Header Banner

ఆస్తిపన్ను చెల్లింపుదారులకు మరో ఛాన్స్‌.. మళ్లీ తెరుచుకున్న రాయితీ గేటు! పన్ను వడ్డీ మాఫీలో కీలక మలుపు!

  Thu Apr 10, 2025 21:10        Politics

ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే గత ఆర్దిక సంవత్సరంలో ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ ఇచ్చిన ప్రభుత్వం.. ఈ నెలాఖరులోపు ప్రస్తుత ఆర్దిక సంవత్సర బకాయిలు చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని కూడా ప్రకటించింది. అయితే గతేడాది బకాయిల్ని వడ్డీ రాయితీతో కట్టే గడువు మార్చి 31తోనే ముగియగా.. ఈ సంవత్సరపు పన్ను రాయితీతో చెల్లించే గడువు మాత్రం నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పట్టణ స్ధానిక సంస్థల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను (భవనాలు మరియు ఖాళీ భూములు) బకాయిలపై విధించిన వడ్డీలో 50% మాఫీకి గత నెలతో ముగిసిన గడువును ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు..


ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!


ఈ గడువును అన్ని పట్టణ స్ధానిక సంస్థల్లో ఒకేసారి చెల్లించాలని, ఈ గడువును అసెస్సీ 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం ఆస్తి పన్ను బకాయిలను 30.04.2025న లేదా అంతకు ముందు ఒకేసారి 50% వడ్డీతో కలిపి చెల్లిస్తే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మరియు 30.04.2025 వరకు పన్ను చెల్లింపుదారులు 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు బకాయిలపై చెల్లించిన వడ్డీని భవిష్యత్తులో ఆస్తి పన్ను చెల్లింపులకు సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2024-25 తేదీ నాటికి 30.04.2025 నాటికి నగదు వాపసు చేయబడదని తెలిపారు. గతంలో ప్రభుత్వం పట్టణ స్ధానిక సంస్థల్లో 2024-2025 సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని ఒకేసారి మాఫీ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే చివరి తేదీ 31-03-2025గా పేర్కొంది. కానీ ఈ ఉత్తర్వులు 25.03.2025న జారీ చేశారు. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఆరు రోజుల ముందు మాత్రమే. అదే సమయంలో ఉగాది, రంజాన్ పండుగల కారణంగా రెండు ప్రభుత్వ సెలవులు వచ్చాయి. దీంతో ఎక్కువ మంది ఈ రాయితీ వాడుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో వారి నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు ఈ పొడిగింపు ఇచ్చారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PropertyTaxRelief #TaxRebate #APGovernment #GoodNewsForTaxPayers #InterestWaiver